Sun Mar 15 2026 21:31:49 GMT+0530 (India Standard Time)
కొనసాగుతున్న నిమజ్జనం.. మధ్యాహ్నం వరకూ
హైదరాబాద్ లో రెండోరోజు కూడా గణేశ్ నిమజ్జన యాత్ర కొనసాగుతుంది.

హైదరాబాద్ లో రెండోరోజు కూడా గణేశ్ నిమజ్జన యాత్ర కొనసాగుతుంది. నిన్న ఆలస్యంగా వినాయక విగ్రహాలు బయలుదేరడంతో ఇంకా విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు చేరుకోలేదు. బషీర్బాగ్, నారాయణగూడ, చిక్కడపల్లి వరకూ గణేష్ విగ్రహాలు నిలిచిపోయాయి. ఆబిడ్స్ నుంచి హుస్సేన్ సాగర్ వరకూ నిమజ్జనం కోసం వచ్చిన వాహనాలు నిలిచిపోయాయి. పది గంటల వరకూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదకు అనుమతించే అవకాశాలున్నాయని పోలీసు అధికారుల నుంచి వచ్చిన సమాచారం బట్టి తెలుస్తోంది.
ట్రాఫిక్ కు అంతరాయం...
గణేష్ విగ్రహాలను నెక్లెస్ రోడ్డులోకి కూడా పంపారు. హైదరాబాద్ నలుమూలల నుంచి విగ్రహాలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే లక్ష విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ విగ్రహాలు తరలి వస్తుండటంతో ఈరోజు మధ్యాహ్నం వరకూ నిమజ్జనం కొనసాగే అవకాశముంది. దీంతో అనేక మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింద.ి కార్యాలయాలకు వెళ్లేవారికి ఇబ్బందికరంగా మారింది.
Next Story

