Fri Dec 05 2025 15:21:12 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో గణేష్ ఉత్సవాలు
కూకట్పల్లి రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి

కూకట్పల్లి రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పదమూడో బ్లాకుల్లోని 2,600కి పైగా కుటుంబాలు కలిసి పదకొండు రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నాయి. దాదాపు 10 వేల మంది నివాసితుల సమిష్టి భాగస్వామ్యంతో ఈ ఉత్సవం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతున్నాయి. ఉదయం పదకొండు గంటలకు మహిళలు పారాయణాలు చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో కూచిపూడి, భరతనాట్యం, భక్తి నృత్యాలు, పిల్లల నృత్యాలు, టీనేజర్ల సంగీత కార్యక్రమాలు, తర్వాత తంబోలా ఆటలతో వేడుకలు రసవత్తరంగా మారుతున్నాయి.
సెప్టంబరు 6న నిమజ్జనం...
పిల్లల కోసం క్విజ్ పోటీ నిర్వహించగా, బహుమతులు ఫ్రీడమ్ ఆయిల్ వారు స్పాన్సర్ చేశారు. ప్రతిరోజూ అక్కడ నివాసముండే దాతలు బ్లాక్ వారీగా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. వర్షానికి ఆటంకం లేకుండా ఉండేందుకు జర్మన్ హ్యాంగర్స్ టెంట్ వేశారు. కె–బ్లాక్ మహిళలు “ఐక్యతలో వైవిధ్యం” అంశంపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం విస్తృత ప్రశంసలు పొందింది. సెప్టెంబర్ 6 వతేదీన సొసైటీ ప్రాంగణంలోనే గణేశుడి నిమజ్జనం జరపనున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇక్కడి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పనుంది. సాంస్కృతిక కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు జె. కృపాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తిలక్ నేతృత్వంలో ఇరవై ఐదు మంది సభ్యులు ఉత్సవ ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
Next Story

