Fri Feb 14 2025 16:48:19 GMT+0000 (Coordinated Universal Time)
బసవతారకం ఆసుపత్రిలో ఉచిత పరీక్షలకు అనూహ్య స్పందన
బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు ప్రారంభమయ్యాయి. మంచి స్పందన లభించింది

బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి ఈ పరీక్షలను ఉచితంగా రోగులకు ఆసుపత్రి యాజమాన్యం ప్రారంభించింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు.ఫిబ్రవరి నాల్గవ తేదీ అంటే నిన్నటి నుంచి ప్రారంభమయిన ఈ ఉచిత పరీక్షలు ఈ నెల 28 వరకు ఉచిత క్యాంప్ కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అన్ని రకాల టెస్ట్ లను...
ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సేవలు ఉపయోగించు కోవాలని వైద్యులు సూచించారు. ఎలాంటి ఖర్చు లేకుండా చేస్తున్న ఈ వైద్య పరీక్షలకు అనేక మంది తొలి రోజు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Next Story