Mon Apr 13 2026 13:15:47 GMT+0530 (India Standard Time)
పెళ్లి సంబంధం పేరుతో చీటింగ్
హైదరాబాద్లో పెళ్లి సంబంధం పేరుతో మోసం జరిగింది.

హైదరాబాద్లో పెళ్లి సంబంధం పేరుతో మోసం జరిగింది. మ్యాట్రిమోనీలో ఫేక్ ఫ్రొఫైల్తో నమ్మించి పెళ్లికి ఒక యువకుడు రెడీ అయ్యారు. మధు అనే యువకుడు ఎఫ్.సి.ఐలో లో చేస్తున్నట్టు ఉద్యోగం నకిలీ ఐడీ కార్డు సృష్టించి పెళ్లికి ప్రయత్నించారు.
కోటిన్నర కట్నం కింద...
పెళ్లి కోసం రెండు కోట్ల రూపాయలను మధు యువతి కుటుంబాన్ని డిమాండ్ చేశాడు. కోటిన్నర కట్నానికి చివరకు అంగీకరించిన నిందితుడు ప్రీ వెడ్డింగ్ షూట్ లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్.సి.ఐలో మధు ఉద్యోగం చేయడం లేదని నిర్ధారించారు. దీంతో మధుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

