Sun Apr 27 2025 09:19:25 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
హైదరాబాద్ లో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినీ నిర్మాత ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ, వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి ప్రారంభమయిన ఐటీ సోదాలు నేడు కూడా జరుగుతున్నాయి. యాభై ఐదు బృందాలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థల్లో...
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ అధిపతుల ఇళ్లు, కార్యాలయాలతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆయన సోదరుడు శిరీష్ ఇళ్లు కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. నిన్న బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయించిన ఐటీ శాఖ అధికారుల పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమా విడుదల చేసింది. దిల్ రాజుకు చెందిన సంస్థ లు సంక్రాంతికి రెండు భారీ సినిమాలు విడుదల చేసింది. గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల చేయడంతో దానికి సంబంధించిన లెక్కలు చూసే పనిలో ఉన్నారు.
Next Story