Sat Dec 13 2025 03:44:41 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నేడు హైదరాబాద్ కు ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ
ప్రపంచ స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీ నేడు హైదరాబాద్ కు రానున్నారు.

ప్రపంచ స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి చేయనున్నాడు. భారత ఫుట్ బాల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా మెస్సీ రాక కోసం ఎదురు చేస్తున్నారు. అర్జెంటీనాకు చెందిన ఈ మేటి ఫుట్ బాల్ ఆటగాడిని చూసేందుకు లక్షలాది మంది ఫుట్ బాల్ ప్రేమికులు ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. దీంతో హైదరాబాద్ కు ఫుట్ బాల్ ఫీవర్ పట్టుకున్నట్లయింది. మెస్సీ సాయంత్రం నాలుగు గంటలకు మెస్సీ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకంటారు.
ఉప్పల్ స్టేడియంలో...
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ స్వాగతం పలికేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం నుంచి మెస్సీ నేరుగా తాజ్ ఫలక్ నుమా హోటల్ కు వెళ్లనున్నారు. మెస్సీ రాక సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెససీ పాల్గొననున్నారు. తర్వాత రాత్రి ఏడు గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. మెస్సీతో ఉరుగ్వేకు చెందిన సువారెజ్, అర్జెంటీనా కు చెందిన డి పాల్ కూడా ఉంటారు. గంట సేపు ఉప్పల్ స్టేడియంలోనే మెస్సీ గడుపుతారు.
కొద్దిసేపు మ్యాచ్ ఆడి...
ఉప్పల్ స్టేడియం చేరుకున్న తర్వాత తొలుత ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. అందులో మెస్సీ పాల్గొంటారు. ఈ మ్యాచ్ ఇరవై నిమిషాలు జరరుగుతుంది. చిన్నారులు ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడతారు. చివరి ఐదు నిమిషాలు మాత్రం మెస్సీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫుట్ బాల్ ఆడతారు. అనంతరం మెస్సీ చిన్నారులతో ముచ్చటిస్తారు. ఆటలో మెళుకువలను చెబుతారు. అనంతరం పెనాల్టీ షూటౌట్ విజేతలకు మెస్సీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. అనంతరం మెస్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానిస్తారు. రాత్రికి హైదరాబాద్ లోనే బస చేసి ఉదయం ముంబయి బయలుదేరి వెళతారు. మెస్సీ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Next Story

