Sat Dec 13 2025 17:14:44 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, రేవంత్ సందడి
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారు.

ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. సింగరేణి ఆర్ఆర్ టీం తరుపున రేవంత్ రెడ్డి, అపర్ణ టీం తరుపున మెస్సీ ఆడారు. రెండు జట్ల మధ్య కాసేపు జరిగిన మ్యాచ్ ను అభిమానులు కనులారా వీక్షించారు. సిగరేణి ఆర్ఆర్ టీం తరుపున ఆడిన రేవంత్ర్ రెడ్డి గోల్ కొట్టారు. ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ కూడా గోల్ కొట్టారు.
స్టేడియం నలువైపులా...
ఫుట్ బాల్ ను స్టేడియంలోకి మెస్సీ కొట్టి అభిమానుల మనసుల్లో ఆనందాన్ని నింపారు. ఇరు జట్లలో మెస్సీ ఫొటోలు దిగారు. స్టేడియం మొత్తం కలియ దిరుగుతూ మెస్సీ అందరికీ అభివాదం చేయడంతో ఉప్పల్ స్టేడియం అభిమానుల నినాదాలతో మారుమోగింది. స్టేడియం నలువైపులా మెస్సీ కనిపించడంతో అభిమానులు ఆనందంతో కేరింతలు కట్టారు.
Next Story

