Sat Dec 13 2025 14:02:26 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ చేరుకున్న మెస్సీ
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్ నుమా తాజ్ డెక్కన్ హోటల్ కు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మెస్సీకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఫలక్ నుమాకు వెళ్లి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మెస్సీని కలిసేందుకు కేవలం 250 మందిని మాత్రమే అనుమతించారు. మెస్సీని కలిసే వారికి క్యూ ఆర్ కోడ్ ఇచ్చారు.
మెస్సీని కలిసేందుకు ...
రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్న మెస్సీ దాదాపు అరగంటసేపు అక్కడే ఉంటారు.రెండు గంటల పాటు ఉప్పల్ స్టేడియంలోనే మెస్సీ ఉండనున్నారు. చిన్నారులకు ఫుట్ బాల్ లో మెళుకువలను నేర్పిస్తారు. అనంతరం పది నిమిషాలు ఫుట్ బాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలస్ వరకూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కోల్ కత్తాలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్ కేవలం పది నిమిషాలు మాత్రమే ఆడతారని, ఫ్యాన్స్ ఇది గమనించాలని పోలీసులు అభిమానులను కోరుతున్నారు.
Next Story

