Wed Mar 18 2026 23:56:53 GMT+0530 (India Standard Time)
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విమానం
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం తో విమానం ఆగిపోయింది

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం తో విమానం ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బంది పడ్డారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ విమానం శంషాబాద్ నుంచి బయలు దేరింది.
ఇబ్బంది పడుతున్న....
అయితే సాంకేతిక సమస్య తో తిరిగి ఈ ఉదయం శంషాబాద్ లో తిరిగి ల్యాండ్ అయింది. దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే విమానం ఉంది. దీంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. నిన్న రాత్రి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. తమను గమ్యస్థానానికి ఎప్పుడు చేరుస్తారో చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు.
Next Story

