Thu Dec 18 2025 13:33:34 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఒరిగిపోయిన ఐదంతస్థుల భవనం
హైదరాబాద్ లో ఒక ఐదు అంతస్థుల భవనం ఒరిగిపోయింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై భవనం నుంచి ఖాళీ చేయించారు

హైదరాబాద్ లో ఒక ఐదు అంతస్థుల భవనం ఒరిగిపోయింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై భవనం నుంచి ఖాళీ చేయించారు. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ డివిజన్ లోని సిధిఖి నగర్ లో ఒక్కసారిగా ఐదు అంతస్థుల భవనం ఒకపక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ కోసం గుంతలు తవ్వడంతో పక్కన ఉన్న భవనం ఒరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు.
కిందకు దూకడంతో...
ఐదు అంతస్థుల భవనంలో అనేక మంది నివాసముంటున్నారు. వారందరినీ అధికారులు ఖాళీ చేయించారు. కొత్త భవనం నిర్మాణం కోసం మిర్యాలగూడకు చెందిన గుంతలు తవ్వడతో ఈ భవనం ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే భవనంలో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. బయట పడటానికి ఇక్బాల్ హుస్సేన్ భవనంపై నుంచి దూకడంతో గాయలపాలు కాగా, ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని బాధిత భవనం యజమానులు కోరుతున్నారు.
Next Story

