Thu Jan 29 2026 04:56:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మలక్ పేట్ లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒకరు మృతి చెందారు

హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. దిల్ సుఖ్ నగర్ సమీపంలోని మలక్ పేట్ లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మలక్ పేట్ లోని శాలివాహన నగర్ లోని పార్క్ లో వాకర్స్ పై కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారిపై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పోలీసులు వచ్చి...
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మలక్ పేట్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే కాల్పులకు ఎవరు పాల్పడిందీ? ఎందుకోసం పాల్పడిందీ అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కాల్పుల్లో చందూనాయక్ అనే వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అదింది. మరి ఎంత మంది గాయపడ్డారన్న విషయమూ తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

