Sun Feb 01 2026 20:41:15 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం..ఎనిమిది మంది మృతి
హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు తెలిసింది

హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు తెలిసింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మీర్ చౌక్ లో ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బయటకు రాలేకపోయారు. మొత్తం నాలుగు కుటుంబాలు ఈ మంటల్లో చిక్కుకున్నాయి. చార్మినార్ సమీపలోని గుల్జార్ హౌస్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
పలువురికి గాయాలు...
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. గుల్జార్ హౌస్ లో జరిగిన ఈ ప్రమాదంలో ముప్ఫయి మంది చిక్కుకోగా వారిలో పదహారు మందిని అగ్నిమాపక సిబ్బంది కాపడగలిగారు. గాయపడిన వారు మొత్తం మూడు ఆసుపత్రుల్లో వీరు చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story

