Fri Dec 05 2025 12:23:10 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఐదో అంతస్తులో?
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. నిమ్స్ లోని ఐదో అంతస్థులోని ఎమెర్జెన్సీ విభాగంలో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఆసుపత్రిలో ఉన్న రోగులను వెంటనే బయటకు తీసుకు వస్తున్నారు. పేషెంట్లను వేరే చోటకు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్చూట్ కారణంగానే సంభవించినట్లు ప్రాధమిక సమాచారం మేరకు తెలిసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే...
వెంటనే ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కిటికీల నుంచి దట్టమైన పొగలు అలుముకోవడంతో ఊపిరి ఆడక కొందరు ఇబ్బందులు పడినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు. వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన భవనంలో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది.
Next Story

