Thu Mar 19 2026 05:48:50 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లో వరసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి

హైదరాబాద్ లో వరసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.ఈరోజు చిక్కడపల్లిలోని విఎస్టీ సమీపంలోని ఒక గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
మంటలు వ్యాపించడంతో....
చిక్కడపల్లి పోలీసులకు వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్లను రప్పించారు. మంటలు ఓ గోదాము నుంచి వస్తుండటంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
Next Story

