Wed Apr 15 2026 14:47:26 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని యూనివర్సల్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెస్టారెంట్ లోని చిమ్నీలో మంటలు వచ్చి ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
యూనివర్సల్ రెస్టారెంట్లో ....
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బందిఘటనా స్థలానికి చేరుకున్నారు. మధురానగర్ లో యూనిర్సల్ రెస్టారెంట్ ఉంది. చిమ్నీలో మంటలు రావడంతో మంటలు ఎగసిపడటంతో రెస్టారెంట్ సిబ్బంది బయటికి పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం అంచనాలు ఎంత మేరకు ఉంటాయన్నది చూడాలి.
Next Story

