Sat Dec 13 2025 22:33:07 GMT+0000 (Coordinated Universal Time)
Prakash Raj : క్షమాపణ కోరిన సినీనటుడు ప్రకాష్ రాజ్
బెట్టింగ్ యాప్స్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.

బెట్టింగ్ యాప్స్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. 2016లో తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని చెప్పారు. 2017 లో బెట్టింగ్ యాప్స్ ను నిషేధించారని అన్నారు. అప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ ను తాను ప్రమోట్ చేయడం లేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే తాను తెలిసి తప్పు చేయలదని ఆయన అన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నారు. అయితే ఇకపై తాను ఇలాంటి తప్పు చేయనని ప్రకాష్ రాజ్ చప్పారు. ఈరోజో సిట్ అధికారుల విచారణకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు.
తెలిసి చేసినా.. తెలియ చేసినా...
తన ఒప్పందాన్ని 2017లోనే రద్దు చేసుకున్నానని ప్రకాష్ రాజ్ చెప్పారు. సిట్ అధికారులకు తాను పూర్తి వివరాలను అందించానని, అన్ని ఆధారాలను, రికార్డులను సమర్పించానని చెప్పారు. తాను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నానని ప్రకాష్ రాజ్ అభ్యర్థించారు. యువత బెట్టింగ్ యాప్స్ కు ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకోవద్దని కూడా చెప్పారు. ఈ యాప్స్ వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, అనేక విధాలుగా నష్టపోతున్నాయని చెప్పారు. సిట్ అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరించానని చెప్పారు.
Next Story

