Sun Mar 08 2026 03:13:06 GMT+0530 (India Standard Time)
మోహన్ బాబు ఇంట్లో పది లక్షలు దొంగతనం
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్పల్లిలోని ఆయన నివాసంలో పది లక్షల రూపాయలు చోరీకి గురయింది.

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్పల్లిలోని ఆయన నివాసంలో పది లక్షల రూపాయలు చోరీకి గురయింది. అయితే పనిమనిషి నాయక్ ఈ నగదును దొంగిలించి పారిపోయినట్లు కనుగొన్న మోహన్ బాబు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాయక్ ను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తిరుపతిలో పట్టుకుని...
ప్రత్యేక పోలీసు బృందాలు నాయక్ కోసం గాలింపు చేపట్టగా, చివరకు నాయక్ ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పది లక్షల రూపాయల నగదును కూడా నాయక్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story

