Thu Jan 22 2026 07:53:24 GMT+0000 (Coordinated Universal Time)
స్వర్ణోత్సవ ఉత్సవాలకు సిద్ధమైన సరూర్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలనీ
సరూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ ఏర్పడి యాభై ఏళ్లు పూర్తయ్యాయి.

సరూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ ఏర్పడి యాభై ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో సరూర్ నగరలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో స్వర్ణోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సరూర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. ఈ నెల 25వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి వెంకటేశ్వర నగర్ కాలనీలోని పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ హాజరు కానున్నారు.
సావనీర్ విడుదల...
సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలవరకూ సాంస్కృతిక కార్యక్రమములు జరగనున్నాయి. కూచిపూడి నృత్యములు, భక్తి గీతాలు పద్యనాటకాలు జరుగుతాయిని నిర్వాహకులు తెలిపారు. శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ చేత వెంకటేశ్వర కాలనీ "సర్వోత్సవ సావనీర్" విడుదల చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు హాజరవుతారనిసరూర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది.
Next Story

