Mon Mar 09 2026 12:31:33 GMT+0530 (India Standard Time)
Hyderabad : సచివాలయం వద్ద లాఠీఛార్జి
వరల్డ్ కప్ భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా గెలవడంతో హైదరాబాద్ లో అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు

వరల్డ్ కప్ భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా గెలవడంతో హైదరాబాద్ లో అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ట్యాంక్ బండ్ సమీపంలోని సచివాలయం వద్దకు వందల సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో అక్కడ పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. వరల్డ్ కప్ లో భారత్ గెలవడంతో ఒక్కసారిగా రాత్రి పదిన్నర గంటల సమయంలో ట్యాంక్ బండ్ పైకి వచ్చారు.
నినాదాలు చేస్తూ...
వచ్చిన వారంతా నినాదాలు, జెండాలతో పాటు బైకులు, వాహనాలతో సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తుండటంతో పోలీసులు తొలుత నచ్చచెప్పారు. అయినా అభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చి అలజడి సృష్టించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేసి యువకులను చెదరగొట్టారు. భారత్ గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కానీ, రోడ్లపైకి వచ్చి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Next Story

