ఫ్యాన్సీ నెంబర్లంటే అంతే మరి.. 12 లక్షలు పెట్టారు
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో టీజీ09ఎఫ్ 9999 నంబరును 12 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది కీస్టోన్ ఇన్ఫ్రా సంస్థ.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో టీజీ09ఎఫ్ 9999 నంబరును 12 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది కీస్టోన్ ఇన్ఫ్రా సంస్థ. టీజీ09జీ 0001 నంబరును 5 లక్షల 66 వేల 111 రూపాయలు చెల్లించి ఎన్ఎస్పీఐఆర్ఏ మేనేజ్మెంట్ సర్వీస్ సంస్థ పొందగా, టీజీ09జీ 0009 నంబరును 5 లక్షల 25వేల రూపాయలకు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది.
టీజీ 09జీ0006 నెంబర్‌ను సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ 3 లక్షల 92 వేల రూపాయలకు సొంతం చేసుకుంది. టీజీ 09జీ0005 నెంబర్‌ను నవలికా చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 లక్షల 11 వందలకు దక్కించుకుంది. టీజీ 09జీ0019 నెంబర్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ లక్షా 60వేల 19 రూపాయలకు దక్కించుకుంది. ఒక్క రోజే ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు 42 లక్షల 10 వేల 844 రూపాయలు ఆదాయం చేకూరినట్లు జేటీసీ రమేశ్ తెలిపారు.

