Sat Dec 13 2025 22:33:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : 80 కోట్ల విలువైన ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు సీజ్
పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు

పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు ఎనభై కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు. శాండ్, గ్రానైట్ వ్యాపారం ద్వారా అక్రమ మైనింగ్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు.
గత ఏడాది దాడులు జరిపి...
గత ఏడాది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎమ్మెల్యే సోదరుడు ఇల్లు, కార్యాలయంపై దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. దీంతో ఎమ్మెల్యే సోదరుడు ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది.
Next Story

