Sat Dec 13 2025 22:33:53 GMT+0000 (Coordinated Universal Time)
ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ
ఐబొమ్మ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టారు.

ఐబొమ్మ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈడీ అధికారులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు లేఖ రాశారు. ఐబొమ్మ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందచేయాలని కోరారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పెద్దయెత్తున మనీలాండరింగ్ కు పాల్పడి ఉంటారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవి నుంచి మూడున్నర కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విదేశీ బ్యాంకుల నుంచి...
రవి దాదాపు నలభైకి పైగా బ్యాంకు ఖాతాలుండటంతో పాటు ఇతర దేశాలకు ఈ నగదును ఏ రూపంలో తరలించారన్న దానిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేయాలని భావిస్తున్నారు. విదేశీ బ్యాంకులను నుంచి పెద్దయెత్తున నగదుతో పాటు క్రిప్టో వాలెట్ నుంచి నెలకు పదిహేను లక్షల రూపాయలు రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లు సమాచారం అందుకున్న ఈడీ అధికారులు విచారణ చేపట్టాలని నిర్ణయించారు. అందుకే ఈ కేసు పూర్తి వివరాలను తమకు అందించాలని లేఖ రాశారు.
Next Story

