Sat Dec 06 2025 02:11:10 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలను ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బూరుగు రమేష్ తో పాటు ఆయన కుమారుడు విక్రాంత్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
రెండు బృందాలుగా విడిపోయి...
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ నగరంలోని ఆల్వల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారవేత్త ఇంట్లో ఎందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు? కారణాలేంటివన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
Next Story

