Sat Jun 21 2025 04:13:23 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నేటితో ముగియనున్న చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్ లో బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ నేటితో ముగియనుంది.

హైదరాబాద్ లో బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ నేటితో ముగియనుంది. నిన్న ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు ముగియనుందని నిర్వాహకులు తెలిపారు. అయితే క్యూ లైన్ లో ఉన్న వారందరికీ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని చెబుతున్నారు. నిన్నటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో అస్తమా రోగులు తరలి వచ్చారు.
భారీ బందోబస్తు మధ్య...
నిన్న తెలంగాణకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు మరణించడంతో వృద్ధులకు సత్వరం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీని ప్రతి ఏడాది మృగశిక కార్తె రోజున బత్తిన సోదరులు పంపిణీ చేస్తారు. ఇందుకోసం లక్షల సంఖ్యలో చేపపిల్లలను రాష్ట్ర మత్స్య శాఖ సిద్దం చేసింది. పోలీసు బందోబస్తు మధ్య చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది
Next Story