Tue Jul 08 2025 18:27:50 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ ను వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్
హైదరాబాద్‌ను డెంగ్యూ ఫీవర్ వణికిస్తుంది. నగరంలో రోజురోజుకూ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి

హైదరాబాద్‌ను డెంగ్యూ ఫీవర్ వణికిస్తుంది. నగరంలో రోజురోజుకూ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి వర్షాలు పడుతుండటంతో పాటు దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 217 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,149 డెంగ్యూ కేసులున్నాయి.
వైరల్ ఫీవర్ తో...
దీంతో పాటు వైరల్ ఫీవర్ తో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువ మంది సీజనల్ జ్వరాలతో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ రోగుల సంఖ్య పెరుగుతుంది.
Next Story