Fri Dec 05 2025 20:25:29 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : పాత అపార్ట్ మెంట్లకు పెరిగిన గిరాకీ... ఎగిరి గంతేసి అగ్రిమెంట్లు చేసుకుంటున్న బిల్డర్లు
హైదరాబాద్ లో పాత అపార్ట్ మెంట్లకు డిమాండ్ పెరుగుతుంది

హైదరాబాద్ లో పాత అపార్ట్ మెంట్లకు డిమాండ్ పెరుగుతుందా? అంటే అవుననే అంటున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరం పెద్దగా విస్తరించలేదు. అయితే హైదరాబాద్ లో అప్పటికింకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందలేదు. మూడు దశాబ్దాల క్రితం అప్పుడప్పుడే ఐటీ రంగం ఊపందుకుంటుంది. దీంతోపాటు కార్పొరేట్ సిటీగా హైదరాబాద్ నగరం వృద్ధి చెందుతుందన్ననమ్మకం పెట్టుబడి దారుల్లో కలిగింది. అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో నడిచే అనేక పరిశ్రమలు ఉన్నాయి. దీనికి తోడు మెడికల్ రంగానికి అడుగులు పడటంతో అపార్ట్ మెంట్ల సంస్కృతి విస్తరించింది. 1980వ దశకంలో అపార్ట్ మెంట్లు ప్రారంభమయినప్పటికీ 1990 నాటికి కొంత అపార్ట్ మెంట్లు ఊపందుకున్నాయి.
నడిబొడ్డున ఉండటంతో...
అప్పట్లో నగరం విస్తరించకపోవడంతో పాత అపార్ట్ మెంట్లన్నీ ఇప్పుడు నగరం నడి బొడ్డున ఉన్నాయి. ఆబిడ్స్, లక్డీకాపూల్, అమీర్ పేట్ వంటి ప్రాంతాలతో పాటు తర్వాత ఐటీ రంగం బూమ్ తో ఏర్పడిన మాదాపూర్ లో కూడా అపార్ట్ మెంట్లు వెలిశాయి. అయితేఅప్పట్లో కొన్నిబడా సంస్థలు మాత్రమే అపార్ట్ మెంట్లు నిర్మించేవి. ఎక్కవగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టేవి. అప్పటికింకా ట్రిపుల్ బెడ్ రూమ్ ల సంస్కృతి రాలేదు. ఎక్కువగా సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు మాత్రమే జరిగాయి. అయితే అవి ఇప్పటికి పాత బడిపోయాయి. కానీ వాటి విలువ ఏ మాత్రం తగ్గలేదంటారు రియల్ నిపుణులు. ఆ అపార్ట్ మెంట్ ను కూల్చి తిరిగి నిర్మాణం చేపట్టి ఫ్లాట్ యజమానులకు కొత్తవి నిర్మించి ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు.
భారీ ఆఫర్లతో...
నిర్మాణ వ్యయం మాత్రం తామే భరిస్తామని అనేక మంది ముందుకు వస్తున్నారు. నాడు ఐదు నుంచి పది లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఒక సంవత్సరం నిర్మాణానికి వదిలేసినా తమ ఫ్లాట్ విలువ కోటి రూపాయలకుపైగానే పలుకుతుందని కొందరు అంగీకరిస్తున్నారు. అంతే కాదు కొత్త ఫ్లాట్ అప్పగించేంత వరకూ అప్పటి వరకూ అద్దెఇంట్లో ఉండాల్సి వస్తే వాటిని కూడా తాము చెల్లిస్తామని బిల్డర్లుముందుకు వస్తున్నారని అంటున్నారు. రీ కనస్ట్రక్షన్స్ ఇప్పుడు చాలా చోట్ల ప్రారంభయ్యాయని, పాత భవనంలో లీకేజీలు కూడా వస్తుండటంతో ఫ్లాట్ల యజమానులు కూడా ఎగిరి గంతేసి సంతకాలు పెడుతున్నారట. ఓల్డ్ అపార్ట్ మెంట్లకు ఇప్పుడు గిరాకీ పెరగడానికి కారణం అదే. స్థలం విలువ పెరగడంతో బిల్లర్ల దృష్టి వీటిపై పడిందంటున్నారు. సో.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో.
Next Story

