Fri Dec 26 2025 06:20:56 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల అయింది

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జోన్లు, సర్కిళ్లు పెంచుతూ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. జీహెచ్ఎంసీలో వార్డులసంఖ్య 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. ఆరు జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త జోన్ల ఏర్పాటు..
కొత్తజోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ లను ఏర్పాటు చేసింది. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ల ఆఫీసులు ఏర్పాటు చేసింది. వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో కొత్త జోన్లు, సర్కిల్ ఆఫీసుల నుంచి పరిపాలన సాగనుంది. డీలిమిటేషన్‌కు సంబంధించి ఈనెల 9న నోటిఫికేషన్ విడుదలయింది. డీలిమిటేషన్‌పై 10 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరించిన ప్రభుత్వం ఆరు వేలకు పైగా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Next Story

