Fri Dec 05 2025 09:33:10 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లి కల్తీ కల్లు కేసులో దర్యాప్తు వేగవంతం
కూకట్ పల్లి కల్తీ కేసులో మృతుల సంఖ్య పెరగుతుంది. ఇప్పటి వరకూ కల్తీకల్లుతాగి ఐదుగురు మరణించారు

కూకట్ పల్లి కల్తీ కేసులో మృతుల సంఖ్య పెరగుతుంది. ఇప్పటి వరకూ కల్తీకల్లుతాగి ఐదుగురు మరణించారు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కల్తీకల్లు నమూనాలను ల్యాబ్ లకు పరీక్షలకు పంపారు. కల్లులో ఏమేం కలిపారో తెలుసుకోవాలని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. అయితే వీటిలో కెమికల్స్ ఉనట్లు గుర్తించినట్లు తెలిసింది. మత్తుకోసం కెమికల్స్ ను కల్లు కాంపౌండ్ యజమానులు కలుపుతున్నట్లు తేలింది. కెమికల్స్ కలపడం వల్లనే అస్వస్థతకు గురయి ఐదుగురు మృత్యువాత పడినట్లు ప్రాధమికంగా తేలింది.
కెమికల్స్ కలిపి...
ఇప్పటికే ఆ ప్రాంతంలోని కల్లుకాంపౌండ్ లను అధికారులు సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.ఇంకా 31 మంది కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీరిలో నలుగురికి డయాలసిస్ చేస్తున్నారని వైద్యులు చెప్పారు. 27 మంది ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉంది.
Next Story

