Fri Dec 05 2025 09:32:12 GMT+0000 (Coordinated Universal Time)
సిగాచీ పరిశ్రమ పేలుడులో విషాదం పెరుగుతున్న మృతుల సంఖ్య
పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 46కు చేరింది.

పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 46కు చేరింది. సంగారెడ్డి జిల్లా సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించి భవనం కుప్పకూలింది. ఈ శిధిలాల కింద మరో పదహారు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. పేలుడు జరిగిన వెంటనే ఐదుగురు సజీవదహనమయినట్లు గుర్తించారు. తర్వాత గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూమరికొందరు మరణించారు. గాయపడిన 30 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులుచెబుతున్నారు. మరో పథ్నాలుగు మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే అర్థరాత్రి సమయానికి మర ఐదుగురి మృతదేహాలను వెలికి తీయగా మరో 9 మంది జాడ మాత్రం తెలియడం లేదు.
గుర్తుపట్టలేని పరిస్థితుల్లో...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు తయారయ్యాయి. దీంతో గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారి బంధువులకు అప్పగిస్తున్నారు. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో పదమూడు మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలు ఎవరివో తెలియడం లేదు. పేలుడు తీవ్రతకు గాయపడి, మంటల్లో చిక్కుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని మాత్రం గుర్తు పట్టగలిగారు. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంత పరిస్థితుల్లో ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలికి చేరుకుని పేలుడు ప్రాంతంలో ఎముకలు, దంతాలు వంటి నమూనాలను మాత్రం సేకరించారు.
కొనసాగుతున్న శిధిలాల తొలగింపు...
ప్రమాద సమయంలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. ఫస్ట్ షిఫ్ట్ లో ప్రమాదం జరగడంతో నైట్ డ్యూటీ రిలీవ్ చేయడానికి వేచి ఉన్న వారిలో కూడా కొందరు మరణించి ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భవనం కుప్ప కూలిపోవడంతో శిధిలాల తొలగింపు కార్యక్రమం జరగుతుంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే తప్ప మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నా ఇంకా వెలికితీత పనులు ఒక కొలిక్కి రాలేదు. సిగాచీ పరిశ్రమలో పేలుడు అనేకమంది కార్మిక కుటుంబాల్లో విషాదం నింపింది.
Next Story

