సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ - ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్..!!
సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ వెబ్సైట్ ద్వారా ట్రాఫిక్ సమస్యలను తేలికగా ఎదుర్కొనండి. ప్రయాణికులకు అలెర్ట్స్, మార్గ సూచనలు!

ట్రాఫిక్ రద్దీ తగ్గించడం మరియు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయాలనే సదుద్దేశంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు,ప్రముఖ ఐటీ సేవల సంస్థ తానా సొల్యూషన్స్ సహకారంతో..సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.,!!
సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి మాట్లాడుతూ...
మొదట సోషల్ మీడియా హాండిల్స్ లో సమాచారం ఇచ్చాము.
ఇప్పుడు "" సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్"" పేరిట ఓ వెబ్సైట్ రూపొందించాం.
https://cyberabadtraficpulse.telangana.gov.in
దీనిలో కి వెళ్లి మీ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి.మీరు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఉన్నా,దారి మళ్లింపులు ఉన్నా..ఇది మీకు అలర్ట్స్ ఇస్తుంది.
దీనివల్ల,రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయినా, ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ ఆంక్షలు, దారిమళ్లింపులున్నా ముందుగానే ప్రయాణికులను ముందే అలెర్ట్ చేస్తుంది. తద్వారా వారు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం సులభం చేసుకోవచ్చు..!!
అంతే కాకుండా వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులతో చాట్ చేసి,మీ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యలు పై సూచనలు కూడా ఇవ్వొచ్చు అని సూచించారు. ప్రయాణికులు 87126 63636 నంబర్లో వాట్సాప్ ద్వారా అభిప్రాయాన్ని లేదా మెరుగుదల ఆలోచనలను పంచుకోవచ్చు.