Sun Feb 01 2026 22:31:05 GMT+0000 (Coordinated Universal Time)
మహ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం
హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో ప్రభుత్వం స్థలం కేటాయించింది

హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు జూబ్లీహిల్స్ లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. 600 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఈ మేరకు మహ్మద్ సిరాజ్ కు ఇంటిపత్రాలను అందచేసింది. టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా గెలిచినందుకు ఈ నజరానాను ప్రభుత్వం ప్రకటించింది.
ఆరువందల చదరపు గజాలు..
ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మహ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్టు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటి స్థలం మంజూరుచేసింది. అతి ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో మహ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలో జారీ కానున్నాయి.
Next Story

