Fri Dec 12 2025 05:24:06 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా
హైదరాబాద్ లో కరోనా కలకలం రేగుతుంది. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి.

హైదరాబాద్ లో కరోనా కలకలం రేగుతుంది. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. కోటి మంది జనాభా ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు నిత్యం లక్షల సంఖ్యలో మహానగరానికి వస్తుంటారు. దీంతో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో....
తాజాగా పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేగింది. ఎస్ఐ తో పాటు నలుగురి కానిస్టేబుళ్లకు కరోనాగా నిర్ధారణ అయింది. పోలీసులు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మిగిలన పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
Next Story

