Sat Dec 13 2025 22:31:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నవీన్ యాదవ్ మెజారిటీ ఎంతంటే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచింది. 24, 600 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై విజయం సాధించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పట్టును కోల్పోలేదని నిరూపించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో కాంగ్రెస్ కు హైదరాబాద్ లో పట్టు లేదని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంది.
రెండు ఉప ఎన్నికల్లో...
కానీ వరసగా రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పట్టు ఉందని నిరూపించుకోగలిగింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని తాను చేజిక్కించుకుంటుందని అంచనాలు వినిపించినా వాటిని పక్కన పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం కొత్త ఊపు నిచ్చింది.
Next Story

