Fri Dec 05 2025 18:05:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ
హైదరాబాద్ కు నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు

హైదరాబాద్ కు నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేుపటి నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల వారితో సమావేశం కానున్నారు. మేధావులు, వివిధ సామాజికవర్గాల సలహాలు, సూచనలను స్వీకరించేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రానున్నారు.
సాయంత్రం ఐదు గంటలకు...
బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాంధీ సాయంత్రం ఐదు గంటలకు కులగణనపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశముంది. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

