Sat Dec 13 2025 22:33:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జూబ్లీహిల్స్ లో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ కు ఆధిక్యత పెరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొంత ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కంటే దాదాపు రెండువేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 12,503, కాంగ్రెస్ 12,292 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 401 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత కనపర్చారు.
మూడో రౌండ్ లో..
రౌండ్ రౌండ్ కి కాంగ్రెస్ ఆధిక్యంలో కొంత మెరుగ్గా కనపడుతుంది. తొలి రెండ్ లో నువ్వా? నేనా? అన్నట్లు సాగిన పోరు రెండో రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూకుడు పెంచాడు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి మాత్రం స్వల్పంగానే ఓట్లు పోలవుతున్నాయి.మూడో రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి లభించడంతో వారు గెలుపు తమదేనన్న ధీమాగా ఉంది.
Next Story

