Sat Dec 13 2025 22:33:20 GMT+0000 (Coordinated Universal Time)
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలట్ లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం లభించింది. మొత్తం 109 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 39, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి పది ఓట్లు లభించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో ఉంది.
ఈవీఎంల కౌంటింగ్...
అయితే ఇప్పటికే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమయింది. ఈవీఎంలలోనూ తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలుత షేక్ పేట్ డివిజన్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ లెక్కింపులో కాంగ్రెస్ కు ఆధిక్యత లభించింది. అయితే మొత్తం పది రౌండ్లు ఉండటంతో బీఆర్ఎస్ ఇంకా గెలుపు పై ధీమాను వ్యక్తం చేస్తుంది.
Next Story

