Sat Dec 13 2025 22:32:19 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జూబ్లీహిల్స్ రెండో రౌండ్ లో కాంగ్రెస్ కే ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. స్వల్ప ఆధిక్యతతోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కంటే 1,144 ఓట్లు మాత్రమే ఆధిక్యంలో ఉంది. రెండోరౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు వచ్చాయి.
నువ్వా? నేనా?
షేక్ పేట్ లో ఆధిక్యం తక్కువగా ఉండటంతో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ఇంకా ఎనిమిది రౌండ్లు మిగిలి ఉండటంతో ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలి రౌండ్ లో షేక్ పేట్ లో భారీ ఆధిక్యత లభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేసింది. అయితే అక్కడ స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. అయితే రెండో రౌండ్ లో కొంత కాంగ్రెస్ కు ఆధిక్యం పెరగడంతో ఆ పార్టీ నేతల్లో గెలుపుపై ధీమాగా ఉంది.
Next Story

