Sat Mar 07 2026 20:43:36 GMT+0530 (India Standard Time)
చలి.. చలి.. వణుకుతున్న జనం
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు.

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. చలిగాలుల తీవ్రతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉదయం పది గంటల వరకూ ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
కనిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరంలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్ లో 14,6 డిగ్రీలు, సరూర్ నగర్ లో 14,9 డిగ్రీలు, ఆల్వాల్ లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఆరు గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. దీంతో ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

