Wed Mar 18 2026 06:27:37 GMT+0530 (India Standard Time)
Mohan Babu : మోహన్ బాబు ఎక్కడ? పోలీసులకు సవాల్
మరోసారి అజ్ఞాతంలోకి నటుడు మంచు మోహన్ బాబు వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది.

మరోసారి అజ్ఞాతంలోకి నటుడు మంచు మోహన్ బాబు వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించడంతో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సోమవారం వరకూ తిరుపతిలోని ఆయన విద్యానికేతన్ లో ఉన్న మోహన్ బాబు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు.
ఈ నెల 16వ తేదీన...
ఈ నెల 16వ తేదీ హైదరాబాద్ నుంచి చంద్రగిరికి చేరుకున్న మోహన్ బాబు 18వ తేదీ బెంగళూరుకు వెళ్లి.. రెండు రోజుల తర్వాత శ్రీవిద్యానికేతన్కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా కారులో మోహన్ బాబు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. పోలీసులు మాత్రం విచారించేందుకు మోహన్ బాబు కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

