Sat Dec 13 2025 22:32:57 GMT+0000 (Coordinated Universal Time)
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో వేగం పెంచిన సీఐడీ
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది

బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది. వరసగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రచారం చేసిన సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను విచారించింది. వారికి బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి ఎంత నగదు ముట్టింది? ఏ రూపంలో వచ్చిందన్న దానిపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకూ విజయ్ దేవర కొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ లను విచారించింది.
ఈరోజు ముగ్గురు...
ఈరోజు కూడాబెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో పలువురు ప్రముఖులను సీఐడీ ప్రశ్నిస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ విచారణకు హాజరైన అమృతచౌదరి, శ్రీముఖి, నిధి అగర్వాల్ లు సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. వారిని వేర్వేరుగా విచారించిన సీఐడీ అధికారులు వారి నుంచి కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలిసింది.
Next Story

