Thu Mar 19 2026 03:01:09 GMT+0530 (India Standard Time)
Jony Master : జానీ మాస్టర్‌కు మరో స్ట్రోక్
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనున్నారు

కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనున్నారు. రంగారెడ్డి కోర్టుల్లో ఈ పిటీషన్ వేయనున్నారు. పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ కు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ లభించింది.
మధ్యంతర బెయిల్ ను...
ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఆయనకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డు తీసుకునేందుకు తాను బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే నేషనల్ అవార్డును జానీ మాస్టర్ కు తాత్కాలికంగా నిలిపివేయడంతో బెయిల్ ను కూడా రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటీషన్ వేయనున్నారు.
Next Story

