Mon Feb 02 2026 11:01:15 GMT+0000 (Coordinated Universal Time)
జానీ మాస్టర్‌కు మరో షాకింగ్ న్యూస్
కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది

కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటీషన్ ను రంగారెడ్డి కోర్టు కొట్టివేసింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
బెయిల్ పిటీషన్ ను...
గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఆయనకు పథ్నాలగు రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో జానీ మాస్టర్ ఉన్నారు. అయితే తనకు బెయిల్ ఇప్పించాలంటూ ఆయన న్యాయస్థానంలో పిటీషన్ వేయగా, కోర్టు కొద్దిసేపటి క్రితం కొట్టివేసింది. దీంతో జానీ మాస్టర్ కు మరోసారి చుక్కెదురయింది.
Next Story

