Wed Mar 18 2026 22:45:35 GMT+0530 (India Standard Time)
ఉద్రిక్తతగా మారిన రాజ్‌భవన్ ముట్టడి
సీపీఐ పిలుపునిచ్చిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తతలకు దారితీసింది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నినాదాలు చేశారు.

సీపీఐ పిలుపునిచ్చిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తతలకు దారితీసింది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. వందలాది సీపీఐ కార్యకర్తలు రోడ్డు మీదకు రావడంతో పోలీసులు వారిని ఖైరతాబాద్ వద్ద నిలిపేసేందుకు శ్రమించాల్సి వచ్చింది.
అరెస్ట్ చేసిన పోలీసులు...
ఖైరతాబాద్ చౌరస్తా దాటి పోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ట్ర నేతల నుంచి కార్యకర్తల వరకూ ీఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరినీ పోలీసులు ఖైరతాబాద్ చౌరస్తాలోనే అరెస్ట్ చేశారు. గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
Next Story

