Sat Dec 13 2025 22:34:10 GMT+0000 (Coordinated Universal Time)
మాగంటి సునీతపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి మాగంటి సునీతపై ఆర్వోకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాగంటి సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Next Story

