Tue Mar 10 2026 11:06:21 GMT+0530 (India Standard Time)
BRS: గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ వర్క్‌షాప్
బీఆర్ఎస్ వర్క్ షాప్ నేడు జరగనుంది.

బీఆర్ఎస్ వర్క్ షాప్ నేడు జరగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఈ వర్క్ షాపు మొదలు కానుంది. ఈ వర్క్ షాపుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు హాజరవుతున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా బీఆర్ఎస్ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ ఏ అంశాలపై చర్చించాలి? అసెంబ్లీ వ్యవహారాలు, సభలో అధికార పార్టీని ఎలా ఇరుకున పెట్టాలి? అన్న అంశాలపై ఈ వర్క్ షాపును బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఈ వర్క్ షాపునుకు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రజా సమస్యలపై గళం విప్పేలా బీఆర్ఎస్ సభ్యులను సిద్ధం చేయనున్నారు.
Next Story

