Sat Dec 13 2025 22:43:20 GMT+0000 (Coordinated Universal Time)
BRS : గెలుపు నాదే : మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఆమె మీడియా తో మాట్లాడారు. ఖచ్చితంగా తమదే గెలుపు అని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు తమ వైపు ఉన్నారని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేస్తూ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారు.
కౌంటింగ్ ఏజెంట్లుగా...
మరొకవైపు బీఆర్ఎస్ మాత్రం కౌంటింగ్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కౌంటింగ్ కేంద్రాలకు పంపింది. కౌంటింగ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహన ఉన్న వారిని మాత్రమే బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. దీంతో తొలుత పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈవీఎంలను అన్నింటినీ టేబుళ్లపై సిద్ధం చేశారు.
Next Story

