Tue Dec 23 2025 04:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు
లండన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది

లండన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బ్రిటీష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో బాంబు ఉందని మెయిల్ రావడంతో అధికారులు అత్యవసరంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించి తనిఖీలను చేపట్టారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు.
బాంబు స్క్కాడ్ బృందంతో...
బాంబు స్క్కాడ్ బృందంతో పాటు ఎయిర్ పోర్టుకు చెందిన పోలీసు అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. లండన్ నుంచి బయలుదేరిన బ్రిటీష్ ఎయిర్ లైన్స్ విమానం హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే ముందుగానే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు ప్రయాణికులను కిందకు దింపి తనిఖీలను నిర్వహిస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
Next Story

