Tue Jan 20 2026 18:01:40 GMT+0000 (Coordinated Universal Time)
మధురా నగర్ లో జాన్వీ కపూర్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బాలీవుడ్ నటి జాన్వీకపూర్ వచ్చారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బాలీవుడ్ నటి జాన్వీకపూర్ వచ్చారు. అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కు కొంత భక్తి శ్రద్ధలు ఎక్కువే. ఆమె తరచూ తిరుమల దర్శనానికి వెళుతుంటారు. చిన్న వయసులోనే ఆథ్యాత్మిక చింతనను అలవర్చుకున్న జాన్వీకపూర్ తాజాగా జూబ్లీహిల్స్ లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చారు.
ప్రత్యేక పూజలు...
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేకంగా తీర్థప్రసాదాలను అందచేశారు. జాన్వీ కపూర్ రాకను తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జాన్వీ కపూర్ తో సెల్ఫీలుదిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
Next Story

