Sun Mar 08 2026 14:04:22 GMT+0530 (India Standard Time)
విజయసాయితో చంద్రబాబు.. తారకరత్న ఇంటి వద్ద
నందమూరి తారకరత్న భౌతిక కాయం ఆయన స్వగృహానికి చేరుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి నివాళులర్పిస్తున్నారు

నందమూరి తారకరత్న భౌతిక కాయం ఆయన స్వగృహానికి చేరుకుంది. హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి నివాళులర్పిస్తున్నారు. తారకరత్న పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి మరదలు కూతురు. బెంగళూరులో చికిత్స పొందుతున్న సమయంలోనూ విజయసాయిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై...
ఈరోజు ఉదయమే తారకరత్న ఇంటి వద్దకు విజయసాయిరెడ్డి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన తారకరత్నకు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కుటుంబ సభ్యులతో వచ్చి తారకరత్నకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, చంద్రబాబు కాసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యంపై వారిరువరూ చర్చించుకున్నట్లు తెలిసింది. రాజకీయంగా ప్రత్యర్థులయినప్పటికీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు కలసి కూర్చుని తారకరత్న మృతి, ఆ కుటుంబ పరిస్థితిపై చర్చించుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.
Next Story

