Wed Jan 28 2026 22:53:24 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం
నేడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.

నేడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని బీజేపీ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉ పఎన్నికకు సంబంధించి బీజేపీ కమిటీని నియమించింది. కమిటీ అందించిన పేర్లను పరిశీలించి ఒకరి పేర్లను హైకమాండ్ కు పంపనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది. వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరుగుతుండటంతో త్వరగా అభ్యర్థిని ప్రకటించి ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో జూటూరు కార్తిరెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది.
Next Story

